కార్తీక దీపం అంటే ఒక వైబ్రేషన్..మరి డాక్టర్ బాబు రోల్ ఉంటుందా ?
on Feb 25, 2024
కార్తీక దీపం ఐపోయి ఏడాది గడిచినా ఆడియన్స్ లో మాత్రం ఆ క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఇక ఇప్పుడు ఈ సీరియల్ సెకండ్ పార్ట్ ని తీసుకొస్తున్నారు. ప్రోమో షూటింగ్ టైంలో ఈ సీరియల్ లీడ్ రోల్స్ కలిసి ఒక వీడియో చేశారు..డాక్టర్ బాబు ఆ వీడియోని తన యుట్యూబ్ లో అప్ లోడ్ చేసారు. "కార్తీక దీపం 2 అని కాదు కార్తీక దీపం అంతే..ప్రేక్షకుల ముందుకు మళ్ళీ వచ్చేసాం..ఆడియన్స్ బాగా గట్టిగా ఈ సీరియల్ రావాలని కోరుకున్నారు..గట్టిగానే పూజలు చేసినట్టున్నారు.
కార్తీక దీపం అంటే ఒక వైబ్రేషన్.. ఈ సీరియల్ గురించి ప్రస్తుతానికి మేం ఏమీ చెప్పలేము. ఈ ప్రోమోలో మీకు ఎంత అర్ధమవుతుందో అంతే..మేము కూడా కొత్తగా ఏమీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం లేదు." అని చెప్పాడు ఇంతలో శౌర్య వచ్చింది..."ఈ సీరియల్ లో డాక్టర్ బాబు ఏమవుతారో నాకు తెలుసు హీరో.. " అనేసరికి "బాబోయ్ ఎం చెప్పేస్తావో ఇంకా డీటెయిల్స్ భయమేస్తోంది..."అని శౌర్యతో ఏమీ మాట్లాడించలేదు "ఐతే ఈ సెకండ్ పార్ట్ లో డాక్టర్ బాబునో కాదో నాకూ తెలీదు..ఉష్ష్..సైలెన్స్..చెప్పకండి. మేమైతే సీరియల్ లో ఉంటాం.. క్యారెక్టర్స్ కానీ కథ కానీ చాలా కొత్తగా ఉంటుంది. డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది, నచ్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..." అని చెప్పాడు డాక్టర్ బాబు. "కార్తీక దీపం ఐపోయినప్పుడు ఈ సీరియల్ లో పని చేసిన అందరికీ ఆడియన్స్ నుంచి మెసేజెస్, ఫోన్స్ చాలా వచ్చాయి. ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. కార్తీక దీపం ఫస్ట్ పార్ట్ ని ఎలా సక్సెస్ చేశారో ఈ పార్ట్ ని కూడా అలాగే సక్సెస్ చేయాలని కోరుతున్నాం" అని చెప్పాడు డాక్టర్ బాబు. ఇంత సక్సెస్ ఐన ప్రాజెక్ట్ కి మళ్ళీ అదే పేరు పెట్టాలని చాలా డిస్కషన్స్ తర్వాత డిసైడ్ అయ్యాము. ఇప్పుడే షూటింగ్ స్టార్ట్ అవుతోంది. త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాం. లవ్ యు ఆల్" అని చెప్పారు డాక్టర్ బాబు, వంటలక్క, శౌర్య"..

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
